Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
AP Chief Minister Nara Chandrababu Naidu has warned Tourism Minister Akhila Priya over boat tragedy on Monday.

ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మంత్రి అఖిలప్రియకు గట్టి ఝలక్ ఇచ్చారు. తోటి మంత్రులు, అధికారుల ముందు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినేత ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అఖిల కంగు తిన్నారు. పది రోజుల క్రితం కృష్ణా నదిలో బోటు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 22 మంది మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా, చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
అఖిలప్రియపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఆమె ఒక్కరికే వర్తించినట్లు కనిపించినప్పటికీ మిగతా మంత్రులకు కూడా ఇది గట్టి హెచ్చరిక అని భావిస్తున్నారు. 22 మంది మృతి చెందడంతో ఆగ్రహంతో చంద్రబాబు అలా మాట్లాడారని అంటున్నారు. రాజీనామా చేయమని చెప్పనప్పటికీ ఆ స్థాయిలో మాట్లాడటంపై చర్చ సాగుతోంది.


Category

🗞
News

Recommended