Skip to playerSkip to main content
  • 8 years ago
Suspense on Telangana Congress Party leader Revanth Reddy's resignation.

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామాపై హైడ్రామా కొనసాగుతోంది. ఆయన రాజీనామా ఇచ్చి రెండు వారాలు అవుతోంది. దీనిపై ఇప్పుడు అందరిలోను చర్చ సాగుతోంది. ఆయన రాజీనామాపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు రేవంత్ రాజీనామా చేశారా, ఒకవేళ చేస్తే రాజీనామా లేఖను నేరుగా స్పీకర్‌కు ఇవ్వకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చినట్లు, వంటి ప్రశ్నలు ఇప్పటికే తలెత్తుతున్నాయి.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ స్పీకర్ ఫార్మాట్లో చంద్రబాబుకు ఇవ్వడానికి గల కారణాలు అంతు చిక్కటం లేదంటున్నారు.
మరోవైపు, రేవంత్ రెడ్డి రాజీనామా అంశాన్ని తెలంగాణ టీడీపీ నేతలు కూడా అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. అయితే, రేవంత్‌కు రాజీనామా చేయాలని ఉంటే నేరుగా స్పీకర్‌కు ఇవ్వాలి గానీ చంద్రబాబుకు ఇవ్వడం ఏమిటని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఆయన పార్టీ మారినా ఇప్పటి వరకు స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేయలేదు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended