Skip to playerSkip to main content
  • 7 hours ago
Nandamuri Vasundhara Election Campaign:  శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ  అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. మొదట సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మంజునాథ్, వార్డు అభ్యర్థులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన మామ నందమూరి తారక రామారావు కాలం నుంచి సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ఏ కార్యక్రమం అయినా ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో నెలకొన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి పట్టణాభివృద్ధికి పట్టుదలతో కృషి చేశారని పేర్కొన్నారు. హిందూపురం మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలని, ఎన్నికల్లో మంచి వ్యక్తి, అభివృద్ధికి కృషి చేసే మంజునాథను చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పట్టణంలోని ఇందిరానగర్, బోయపేట, వాల్మీకి సర్కిల్, సత్యనారాయణపేటలో పార్టీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Category

🗞
News

Recommended