Vijayawada Kanaka Durga Temple Drone Shots : విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తజనసంద్రంగా మారింది. జగన్మాతను దర్శించుకుని తరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు విజయవాడకు క్యూ కడుతున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో దుర్గమ్మ ఆలయాన్ని, ఇంద్రకీలాద్రి పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అత్యంత అద్భుతంగా అలంకరించారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల నడుమ ధగధగలాడుతున్న ఆలయాన్ని చూసేందుకు భక్తులకు రెండు కళ్లూ సరిపోవడం లేదు. ఇంద్రకీలాద్రి కొండ మొత్తం ఒక దివ్యమైన కాంతిపుంజంలా మెరిసిపోతూ భక్తులను ఆధ్యాత్మిక మైమరపునకు గురిచేస్తోంది. మరోవైపు, నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ శోభను ప్రతిబింబిస్తూ తీసిన డ్రోన్ విజువల్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆకాశం నుంచి లైటింగ్ వెలుగుల్లో మెరిసిపోతున్న కనకదుర్గమ్మ ఆలయ వైభవం, కృష్ణా నది తీరం, భక్తుల రద్దీని చూపే ఈ డ్రోన్ దృశ్యాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వాటిని సంబంధించిన విజువల్స్‌ను ఇప్పుడు చూద్దాం.