Skip to playerSkip to main content
  • 6 months ago
Canada People Special Wishes To CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా కెనడాకు చెందిన రోజ్ సంస్థ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర నీరు, మట్టి నిల్వ ఉంచిన ప్రాంతంలో యాగం చేపట్టారు. అనంతరం శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన బిళ్వం, కదంబ మొక్కలను నాటారు. కెనడా నుంచి వచ్చిన చిన్నారి శ్రీవల్లి సీఎంకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు.  అలానే ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో ఫ్రాంక్ఫర్ట్ నగరంలో చంద్రబాబు  జన్మదిన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్న తెలుగుదేశం అభిమానులు అందరు పాల్గొని చంద్రబాబు ఇంకా ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అయిన విజన్​తో రాష్ట్రానికే కాకుండా దేశానికీ కూడా దారి చూపాలన్నారు. ఆంధ్ర ప్రజలు కలలు గన్న ఆంధ్ర రాజధాని అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేయాలి అని అభిమానులు కోరుకున్నారు.

Category

🗞
News
Transcript
00:28Satsang with Mooji

Recommended