రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సెంట్రల్ - విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ (నంబరు 20677/20678) రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జనవరి 12న ఈ రైలును ప్రారంభించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. అయితే, తాజాగా ఆ ముహూర్తం జనవరి 15వ తేదీకి మారింది. సంక్రాంతి వేళ ఈ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు. ప్రస్తుతం చెన్నై సెంట్రల్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరే వందే భారత్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 12.10కి చేరుతోంది. పొడిగించిన సర్వీసు 11.45 గంటలకు విజయవాడకు చేరుకొని, అక్కడి నుంచి 11.50కి బయల్దేరి మధ్యాహ్నం 12.25కు గుడివాడ, 1.30కి భీమవరం, 2.10కి నరసాపురం చేరుతుంది.
The Indian Railways has announced great news for Andhra Pradesh! The Chennai–Vijayawada Vande Bharat Express is now extended up to Narasapuram, benefiting thousands of passengers in West Godavari region.
Be the first to comment