Prathidwani : క్రికెట్ బ్యాట్ దొంగలించే క్రమంలో చూసిందని 10 ఏళ్ల బాలికను పొడిచి చంపిన 14 ఏళ్ల పిల్లాడు . ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న భార్యను 5 నెలల గర్భవతనీ చూడకుండా గొంతుకోసి చంపి, ముక్కలుగా చేసి మూసీలో విసిరేసిన రాక్షసుడు. కట్టుకున్న ఇల్లాలిని కడుపు మాడ్చి, ఎముకల గూడుగా మార్చిన పైశాచికత్వం. ఇంకోచోట మత్తుమందు ఇచ్చి 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నీచులు. ఇవేనా? భర్తను చంపిన భార్య. ప్రియుడితో కలసి పతిదేవుడు ప్రాణాలు తీసిన మహిళ. వింటేనే ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్న దారుణమైన హత్యలు, హత్యోదంతాలు ఇవి.ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తరచు ఇదే రక్తచరిత్ర! ఐనవాళ్లే యమకింకరులవుతున్నారు. కొందరు పసిప్రాయంలోనే పాశవిక ప్రవృత్తితో మనుషులా, రాక్షసులా అనే భయం కలిగేలా చేస్తున్నారు. మరి ఎందుకింత హింస? ఈ ధోరణులు నేటి సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సామాజికవేత్త డా. బీ కీర్తి, ప్రముఖ చైల్డ్ సైకియాట్రిస్ట్ డా. మండాది గౌరీదేవి, మానసిక ఆరోగ్య నిపుణురాలు డా. మానసలు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. Conclusion:
Be the first to comment