CM Chandrababu on Medical Health : వైద్యం, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై ఆయన వివరించారు. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
Be the first to comment