Minister Narayana Review Meeting About GVMC : 4 నెలల్లో విశాఖ మహానగరపాలక సంస్థ కొత్త మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తామని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ నూతన మాస్టర్ ప్లాన్‌పై సచివాలయంలో అధికారులతో, MLAలతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏపీకి ఫైనాన్సియల్ సిటీ విశాఖ మాస్టర్‌ప్లాన్ పై చర్చించామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాళ్ళ స్వార్థానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేశారని ఆరోపించారు.
Be the first to comment