Special Story On Archery Academy : అదో మారుమూల ప్రాంతం. ఐనా అక్కడి విద్యార్థులు ఎక్కుపెట్టిన బాణంగురితప్పదు. చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా అకుంఠిత దీక్షతో ముందుకుసాగుతూ పతకాలు సాధిస్తున్నారు. సమయ స్పూర్తి, చాకచక్యంగా పట్టువదలకుండా నిత్యం సాధన చేస్తూ విలువిద్యలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టడమే లక్ష్యంగా ఆ క్రీడాకారులు ముందుకు సాగుతున్నారు.