Actor Prudhvi Raj Complaint on Social Media Trolls : సైబర్ క్రైమ్ పోలీసులను నటుడు పృథ్వీ రాజ్ ఆశ్రయించారు. రెండ్రోజులుగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. 'లైలా' ప్రీరిలీజ్ కార్యక్రమంలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఫోన్‌కాల్స్, మెసేజ్‌లతో తనను వేధిస్తున్నారని కుటుంబసమేతంగా సైబర్ క్రైమ్ పోలీసులకు పృథ్వీ ఫిర్యాదు చేశారు.
Be the first to comment