Bandi Sanjay on Delhi Election Result 2025 : దిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. దిల్లీ ప్రజలు చీపిరితో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను దిల్లీ ప్రజలు కోరుతున్నారన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వారికి వద్దని భావించారని విమర్శించారు. దిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందన ముందు నుంచి ఊహించిందేనన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీ ఓటు వేశారని చెప్పారు.
Be the first to comment