CEIR Website to Recover a Lost Phone : సెల్ఫోన్ పోగొట్టుకున్న వారికి ఎలా రికవరి చేయాలో తెలియదు. ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. సహజంగా సెల్ఫోన్ పోగానే CEIR వెబ్సైట్లో మొబైల్ పోయిందని చేస్తే ఈజీగా కనిపెట్టవచ్చు అంటున్నారు పోలీసులు. హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 5 విడతలుగా రికవరీ చేసిన ఫోన్ల పంపిణీ చేపట్టారు. 5వ విడతలో భాగంగా నెలన్నర రోజుల్లో 1,190 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేసి CEIR పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Be the first to comment