Railway Police Solve Theft Case at Vijayawada Railway Station : విజయవాడ రైల్వేస్టేషన్‌లో జరిగిన చోరీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. ఈ నెల 25న దోపిడీ చేసిన 64లక్షల రూపాయలను రికవరీ చేసి నిందితులను అరెస్టు చేసినట్లు రైల్వే డీఎస్పీ రత్నరాజు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన బంగారం దుకాణం వ్యాపారి, సిబ్బంది బంగారం కొనుగోలు చేసేందుకు నగదుతో చెన్నై వెళ్తుండగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో డబ్బులు ఉన్న సూట్ కేసును ముగ్గురు వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు.
Be the first to comment