Rayanapadu Railway Gate Problems : ఎందరో ప్రయాణికుల ఎదురుచూపులకు తెరదించుతూ పట్టాలపై కూత పెడుతూ వచ్చే రైలు వాహనదారుల సహనానికి మాత్రం పరీక్షలు పెడుతోంది. రైలు వచ్చిపోయే వేళల్లో తరచూగా గేటు వేయడంతో ఎండలో గంటల తరబడి దుమ్ము, ధూళి మధ్య వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ శివారులోని రాయనపాడు రైల్వే గేటు సమస్యతో అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.