Rare Surgery in Guntur Vikas Hospital : గుంటూరు వికాస్ ఆసుపత్రి వైద్యులు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా అరుదైన శస్త్రచికిత్స చేశారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాము అనే వ్యక్తి కడుపు నొప్పి సమస్యతో వైద్యులను కలిశారు. గుండె నుంచి శరీరానికి రక్తం సరఫరా చేసే రక్తనాళం ఇన్ ఫెక్షన్ కు గురై ఉబ్బిపోయి పొట్టలోకి రక్తం కారుతోందని నిర్ధారించారు. దానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెన్నై వెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు రూ. 20 లక్షలు అవుతుందని చెప్పడంతో అంత డబ్బు లేక రాము తిరిగి వచ్చేశారు.
Be the first to comment