టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చి, ఇన్ని రికార్డులు సాధించడానికి కారణమైన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హీరో అల్లు అర్జున్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ.. సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబులకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రాంతీయ సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి దేశంలో ఉన్నతస్థాయిలో ఉందని పేర్కొన్నారు. తొలిరోజు వచ్చిన నెంబర్లు తన సినిమాపై ఎంత మంది చూశారనడానికి నిదర్శనమన్నారు.
Be the first to comment