Illegal Constructions Demolition in Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణలు తొలగించారు. చెరువుకు ఆనుకుని గత కొన్నేళ్లుగా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణలు తొలగించే ప్రాంతానికి వైఎస్సార్సీపీ నేత పేర్ని కిట్టు వచ్చారు. వాటిని తొలగించడంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా, ఆక్రమణ స్థలాలు ఖాళీ చేయకపోవడంతో తొలగింపు చర్యలు చేపట్టారు.
Be the first to comment