Rupees 23 Crore Fraud in Nandyal District : అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలకు 23 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన వ్యక్తిని నంద్యాల జిల్లా డోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన రామాంజనేయులు డోన్‌లోని కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు. 2021 నవంబర్ నుంచి పట్టణంలోని ఓ ఆయుర్వేదిక్ దుకాణంలో పని చేస్తూ అక్కడే ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. లక్షకు 10 వేల రూపాయలు వడ్డీగా చెల్లిస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేశాడు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పి నమ్మించాడు. సెప్టెంబర్ నుంచి వడ్డీలు ఇవ్వడం నిలిపివేయగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు రామాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి బ్యాంకు ఖాతాల్లోని డబ్బును ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. .
Be the first to comment