YS Sharmila Padayatra: రాష్ట్రంలో రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ గౌరవించడం లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. గెలిచిన శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లాలనేది రాజ్యాంగం చెబుతోందని, కానీ వైఎస్సార్సీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి పోలేదని, అలాంటి వారంతా రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేడ్కర్ స్మృతి వనం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి షర్మిల పాదయాత్ర నిర్వహించారు.
Be the first to comment