Araku Valley Tourist Attractions: పాడేరు అందాలు నిత్యం పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తుంటాయి. అరకులోయ సొబగులు, వంజంగిలో మేఘాల సోయగాలు యాత్రికులను అబ్బురపరుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్ర ఊటీ అరకులోయకి కొత్త సొబగులు సమకూరుతున్నాయి. అరకులోయను సందర్శించే పర్యటకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు వీలుగా పాడేరు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ చొరవతో ఆంధ్ర ఊటీ అరకు లోయలోని పద్మాపురం ఉద్యానవనంలో సాహస వినోదాన్ని అందించేందుకు నూతనంగా హాట్ బెలూన్ ప్రారంభించారు.
Be the first to comment