Tribes Facing Severe Problems Due to Heavy Rains : భారీ వర్షాలకు గెడ్డలు పొంగడంతో అల్లూరి జిల్లాలోని గిరిజన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇళ్లన్నీ వరద నీటిలో మునిగి నిరాశ్రయులయ్యారు. వరదలకు గ్రామంలోకి పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్టు కొట్టుకొచ్చాయి. పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. కొండ ప్రాంతం కావడంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కూడా అంత సులభం కాదు. అత్యాధునికమైన సాంకేతికతో కూడిన డ్రోన్ కెమెరాలు, జీపీఎస్ సర్వే ద్వారా ఆస్తి, పంట నష్టం అంచనాలు వేసి ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత గిరిజనులు కోరుతున్నారు.
Be the first to comment