Murders with Cyanide in AP : డబ్బు కోసం చుట్టుపక్కల వారిని సైనైడ్తో చంపుతున్న ఘటనలు ఏపీలోని గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించాయి. మహిళ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ముగ్గురు మహిళలు ముఠాగా ఏర్పడి ఈ ఘాతుకాలు చేస్తున్నట్లు తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. ఈ ముఠా చేతిలో పడి నలుగురు మరణించగా మరో ముగ్గురు తప్పించుకున్నారు. ఈ వ్యవహారంలో మాజీ వాలంటీర్ ఒకరు కీలక నిందితురాలిగా ఉండటం విశేషం.
Be the first to comment