AP Government Inquiry on Illegal Mining : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్, సిలికాశాండ్ అక్రమాలపై సీఐడీ విచారణ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన దోపిడీ వివరాలను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ సిద్ధం చేస్తోంది. లీజుదారులు విక్రయించే టన్ను సిలికాశాండ్ ధరను రూ.450 నుంచి రూ.1400లకు పెంచారు. కానీ రూ.700 మాత్రమే ఆన్‌లైన్‌లో స్వీకరించి, మిగిలిన రూ.700లు నగదుగా తీసుకున్నారు. ఏటా సగటున 18 నుంచి 20 లక్షల టన్నులు విక్రయించారు. ఇలా టన్నుకు రూ.700 చొప్పున వసూలు చేసిన నగదు ఎక్కడికి చేరిందనేది సీఐడీ విచారణలో తేలుతుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Be the first to comment