ఆంధ్రప్రదేశ్లో ప్రజలను వరద వణికిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు ఊళ్లను, పొలాలను ముంచెత్తడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ముంపు ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ బాధితులను ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు.