కాంట్రాక్టులు, ఉద్యోగ నియామకాల్లో మాజీ సీఎం జగన్ అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డికి సంబంధించిన మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆయన హయాంలో సంస్థకు చెందిన రూ.151 కోట్లకు బిల్లులు కనిపించడం లేదు. ఆ మొత్తాన్ని ఎవరికి చెల్లించారనే సమాచారం దొరకడం లేదు. ఈ వ్యవహారంపై నిశితంగా పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా సంస్థ నుంచి ఒక్క రూపాయి చెల్లించాలన్నా నిర్ణీత విధానం ఉంటుంది. ఆ చెల్లింపు దస్త్రంపై సంబంధిత అధికారులు సంతకాలు చేయాలి. ఇవేమీ లేకుండానే సంస్థ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డి వ్యవహరించినట్లు తెలుస్తోంది.
Be the first to comment