Marathi Teachers in Telugu Schools in Kamareddy : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని 'తెలంగాణ-మహారాష్ట్ర' సరిహద్దు గ్రామాల్లో ఎక్కువగా మరాఠీ, తక్కువగా తెలుగు మాట్లాడుతారు అక్కడి ప్రజలు. ఆ గ్రామాల్లో గతంలో మరాఠీ మీడియం బడులే ఉండేవి. కొన్నేళ్ల కింద వాటిని తెలుగు మాధ్యమ పాఠశాలలుగా మార్చారు. తెలుగు మీడియం పుస్తకాలే ఇస్తున్నారు. అయితే ఉపాధ్యాయులను మాత్రం మార్చకపోవడంతో బోధించే విద్య అర్థంకాక, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
Be the first to comment