చీప్ లిక్కర్ యాభై రూపాయలకు ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని సోము వీర్రాజు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. సోము వీర్రాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా చేశారో అర్థం కావడం లేదని.. సారాయి ఇచ్చి ఎవరైనా ఓట్లు అడుగుతారా అని ఎద్దేవా చేశారు. మతాన్ని రెచ్చగొట్టేలా వీర్రాజు మాట్లాడటం బాధాకరమన్నారు.
Category
🗞
News