శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ కార్డుల పేరిట మోసం వెలుగు చూసింది. ఈ వ్యవహారాన్ని వినియోగదారులు.. బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకురావడంతో బయటపడింది. మొత్తంగా ఓ కాంట్రాక్టు ఉద్యోగి రూ.26 లక్షల మేర స్వాహా చేశాడు. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితుడిని పట్టుకున్నారు. కేసు వివరాలను పాలకొండ డీఎస్పీ పి.శ్రావణి మీడియాకు వెల్లడించారు.
Category
🗞
News