Skip to playerSkip to main contentSkip to footer
  • 12/22/2021
కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహం తొలగింపు వివాదానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం శివాజీ నగర్‌లో ఇటీవలే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించారు. దీంతో దళిత సంఘాలు ఆందోళన బాట చేపట్టి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని... అంతవరకు తమ నిరసన ఆపేది లేదంటూ దళిత సంఘాలు తేల్చి చెప్తున్నాయి.

తమకు న్యాయం చేయాలని.. విగ్రహం ఉన్నచోట పెట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా చేరుకుని.. నిరసనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా కూడా దళిత సంఘాలు వినలేదు. అర్ధరాత్రి సమయంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని.. ఏ సమయంలో అయితే తొలగించారో అదే సమయానికి విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Category

🗞
News

Recommended