గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాలోని ఐదుగురిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరూ కేరళ, కర్నాటక రాష్ట్రాలు చెందిన ఇద్దరూ నిందితులున్నాయి. కర్నాటకకు చెందిన మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ చెప్పారు. గుంటూరుకు చెందిన వినయ్, వెంకటేష్, నితిన్ స్నేహితులు. వినయ్ విశాఖ జిల్లా పాడేరు ప్రాంతం నుండి గంజాయి కొనుగోలు చేసిన ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుంటాడు. వినయ్ తన స్నేహితులైన వెంకటేష్, నితిన్ తో కలిసి లిక్వడి గంజాయి తయారు చేసి విక్రయాలు చేస్తుంటారు. వినయ్కి కర్నాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన అబూబకర్ అలియాస్ అక్బర్కు పరిచయం ఉంది. అబూబకర్ ద్వారా కేరళకు చెందిన ఇషాక్ వామన్ జోర్, కర్నాటకకు చెందిన మహ్మద్ ఇషాక్ లతో వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏపి నుండి ఇతర రాష్ట్రాలకు పంపి అక్కడ విక్రయాలు చేస్తున్నారు. గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో గంజాయి ఒక కారు నుండి మరొక కారులోకి మార్చుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు పది లక్షల రూపాయల గంజాయి, లక్షన్నర లిక్విడ్ గంజాయి, రెండు కార్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Category
🗞
News