Vandanamamma - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : VANDANAMAMMA

పల్లవి : వందనమమ్మా! అభివందనం మా చదువుల తల్లీ! అభివందనం
సకల విద్యల సారము, ఈ సర్వశక్తి సాకారము సత్యరూపమయి, సామగానమయి, హంసవాహినీ"వందన"

చరణం : వీణావాణి, పుస్తకపాణివి నీవే సకల కళల కాణాచివి నీవే
వికసిత వదనపు శిశిరకాంతివి నీవే వెలుగు చిందు మా భారతి నీవే
బ్రహ్మ దేవుని మానసవల్లి అష్టసిద్ధు లొసగు నాల్గు వేదముల మూల శక్తివి
ఇల మము తరియింపవె తల్లీ "వందన"

చరణం : స్వచ్ఛమైన వాక్కు, వచనం నీవే విద్య నేర్పించు సత్యము నీవే
సిరియు, విద్యయు, ఉభయము నీవే నరులు పొందుదురు భూతల స్వర్గము
విద్యతోనె మనుగడ సతతం విద్య యొసగు సకలం విద్య కలిగినచొ ఉన్నత స్థానం
సర్వ సుఖములకు సోపానం "వందనం"