Enduko Na Manasu - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : ENDUKO NAMANASU

పల్లవి : ఎందుకో నా మనసు, ఎదురు సూత్తున్నాది
ఎల్లలేలేని సామి, ఎదురుగ వత్తాడని "2"
హైలెస్సో, హైలో, హైలెస్సా "ఎందుకో" "2"

చరణం : సెట్టు, సేమలు అన్నీ, ఎదురు తెన్నులు కాసే
సేతితో నా సామి, తాకగ మురిసేను "2"
నోరులేని జీవులన్నీ, కళ్ళు ఇల్లు సేసుకొని "2"
సామిరాక కోసమే, ఎదురు సూత్తున్నవి
హైలెస్సో, హైలెస్సా "ఎందుకో" "2"

చరణం : ఏటిలోని సేపలన్ని, నీరుగారి పోయినవి
నీరాక కోసమై, సిక్కవు వలలోన "2"
కొండలన్నీ, నీ రాకకై బండ బారి పోయినవి "2"
నీ రూపు దాల్చుటకూ, నీ సేవ సేయుటకూ
హైలెస్సో, హైలెస్సా "ఎందుకో" "2"

చరణం : మణిసై పుట్టినాను, నీ సేవ కోసమే
నిన్నేల మరిసేనూ, నీ కై మసలేను "2"
నాసామి, నీకేమి, బదులుగ యిచ్చేను
నామనసు నీకెపుడో, నైవేద్దె మాయెను హైలెస్సో, "2"