Alaramudainanu - Sarada Sai

  • 4 years ago
Sudhanva Sankirtanam : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Singer : Sarada Sai : Music : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

LYRICS :

అలరాముడైననూ

పల్లవి : అలరాముడైనను, సరి బాలుడైనను
అమ్మ ఒడిలో హాయిగా నిదురబోవు

అ.ప : అల దైవమైనను, ఇల మనుజుడైనను
ఎంత ఎదిగినను, పసిబాలుడే తాను"
జో జో జో "2" "అల"

చరణం : పుడమి అయినను, స్వర్ణవూయలే ఐనను
పసిపాపలు, నిదురలొ పరవశింతురు
మహరాణికైనను, సామాన్య వతికైన
కన్న ప్రేమకు కొదవె వుండదు "అల"

చరణం : కడుపేదకైన, ధన, భూపతికి ఐనను
వాత్సల్యమునకు వారధి వుండదు "2"
జున్నుపాలైననూ, కటిక నీరైననూ
ఆకలికిబేధమసలుండదు "అల"

చరణం : సురపతులే ఐన, దైత్యులే ఐన
అధికులే మరి హీనులే ఐన
అవ్యాజ కరుణను జూపుటలో
జగమందు స్వామికి, సరిజోడి కనము "అల"
"జో "అచ్యుతానంద! జోజోముకుందా!
లాలిపరమానంద, రామ గోవిందా! జో జో!"