తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పదిరోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోనే కొనసాగుతూ తమ ఆందోళనలనను, నిరసనలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. అంతేగాక, సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన పలువురు కార్మికుల్లో ఆందోళనకు కారణమవుతోంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మంకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో సురేందర్ గౌడ్ అనే కండక్టర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. నర్సంపేటలో మరో డ్రైవర్ కూడా ఆత్మహత్యాత్నం చేశాడు. తాజాగా, హైదరాబాద్ నగరంలో మరో కండక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Be the first to comment