ఆల్కహాల్ మత్తులో ఆడి కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు మందుకొట్టిన ముద్దుగుమ్మలు. వీకెండ్‌లో ఆల్కహాల్ మత్తులో అమ్మాయిలు తాగి ఊగారు. పబ్బుల్లో పీకల్దాక తాగి కార్ల స్టీరింగ్ పట్టి రోడ్డెక్కారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవ్ చేస్తూ వస్తున్న యువతులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36, ఫిలింనగర్ ప్రాంతాల్లో అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. Two women caught in #DrunkAndDrive in #Hyderabad, police seized cars