ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకను ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యవహారాల్లో మెళకువ వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. సంతానం ధోరణి ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం.
Be the first to comment