తరచూ మమ్మల్ని ఈ విధంగా ప్రశ్నలు అడిగారు అవి, “యాకుల్ట్ ని ఎవరు వినియోగించవచ్చు”, “యాకుల్ట్ ని ఎవరు తాగవచ్చు”, “దీన్ని ఖాళీ కడుపుతో (పరగడుపున) తీసుకోవచ్చా” అని.
నిజానికి ఏడాది వయస్సు పైబడిన పిల్లలు, వయోజనులు, గర్భవతులు, వృద్ధులు ఇలా ప్రతీ ఒక్కరు దీన్ని తీసుకోవచ్చు. ఇది కుటుంబంలో ప్రతీ ఒక్కరి కోసం ఉద్దేశ్యించబడింది. నిజానికి, ప్రతీరోజూ మేము అంటే నా తల్లితండ్రులు, నా భర్త, నా పిల్లలు మేమంతా యాకుల్ట్ కి అలవాటుపడ్డాము... ముఖ్యంగా మా నాన్నగారు మా యాకుల్ట్ నీ తీసుకోవాల్సిందే అని సూచించారు. ఆయన రుచిని ఇష్టపడతారు. కానీ చాలా ముఖ్యంగా ఇది ఆయన మల విసర్జన పనిని మెరుగుపర్చడంలో సహాయపడింది. అవును, యాకుల్ట్ ని ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. కానీ చాలామంది ప్రజలు యాకుల్ట్ ని తమ బ్రేక్ ఫాస్ట్ తో పాటు తీసుకోవడానికి ఇష్టపడతారు. అందువల్ల అది రోజు వారి జీవితంలో భాగంగా మారింది. నిజానికి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మలంలో విసర్జించబడుతుంది. కాబట్టి క్రమబద్ధంగా తీసుకోవడం చాలా ప్రధానం.