అమ్మ ఒడి అన్నారు. పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలకు మేనమేమగా ఉంటానని చెప్పారు. ఇవన్నీ..ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ నోట వచ్చిన మాటలు. మరి..ఇదే ముఖ్యమంత్రికి ఇంత ఘోరం జరుగుతున్నా తెలియలేదా. అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లలేదా. ఆరోగ్య శాఖా మంత్రికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అయన ఎక్కడున్నారు. అనంతపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వందలాది శిశవులు మరణిస్తున్నా.. ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు..దీనికి బాధ్యులు ఎవరు..