Skip to playerSkip to main content
  • 7 years ago
All-rounder Mitchell Marsh's "lineage" is a reason why he has been named one of Australia's new Test vice-captains, according to selector Trevor Hohns.
#Mitchell Marsh
#Josh Hazlewood
#pakvsbangladesh
# indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా సరికొత్త ప్రయోగానికి తెరదీసింది. ఆస్ట్రేలియా తొలిసారి తన టెస్టు జట్టుకు ఇద్దరు వైస్‌ కెప్టెన్లను నియమించింది. ఈ మేరకు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, పేసర్ జోష్ హాజెల్‌వుడ్‌కు బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్‌ టిమ్‌ పైనీకి వీరిద్దరూ సహకారం అందిస్తారని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.
బాల్‌ టాంపరింగ్‌ వివాద నేపథ్యంలోనే నాయకత్వ నమూనాలో క్రికెట్‌ ఆస్ట్రేలియా మార్పులు చేసింది. ఆటగాళ్ల ఓట్లు, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఇద్దరు వైస్‌ కెప్టెన్లను నియమించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ కొత్త విధానంవల్ల కెప్టెన్‌కు మరింత వెన్నుదన్ను లభిస్తుందని చెప్పింది. ఈ విధానాన్ని అనేక క్రీడల్లో ఉపయోగిస్తున్నారని వివరించింది.
కెప్టెన్ టిమ్ పెయినీ, జట్టు సభ్యులు, కోచ్ జస్టిన్ లాంగర్, సెలెక్టర్ ట్రెవర్ హాన్స్ ఈ విధానానికి ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగా ఆస్ట్రేలియా సెలక్టర్ ట్రెవర్‌ హాన్స్‌ మాట్లాడుతూ "ఈ కొత్త నాయకత్వం కెప్టెన్‌కు మంచి మద్దతిస్తుందని నమ్ముతున్నాం" అని అన్నాడు. ప్రస్తుతం ఆసీస్ టెస్టు జట్టుకు టిమ్‌ పైన్‌ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ 7 నుంచి పాకిస్థాన్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు మాత్రం మార్ష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఎందుకంటే హాజెల్‌వుడ్ గాయంతో అందుబాటులో లేడు. బాల్ ట్యాంపరింగ్ ఘటన తర్వాత ఆసీస్ ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో మళ్లీ పునర్‌వైభవాన్ని సంతరించుకోవాలని చూస్తున్న ఆస్ట్రేలియా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended