ప్రణయ్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. అమృత వర్షిణిని వదిలివేస్తే రూ.కోటిన్నర ఇస్తానని తండ్రి మారుతీరావు ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు పరిచయం ఉన్న రాజకీయ నేతలతో కలిసి కూతురు, అల్లుడిని విడదీయాలనుకున్నాడు. అమృతను శాశ్వతంగా మరిచిపోవాలని, ప్రణయ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని సిమ్ నెంబర్లు ఇచ్చి కొత్త నెంబర్లు తీసుకోవాలని మారుతిరావు చెప్పాడట. ఎల్ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ప్రణయ్ తండ్రి బాలస్వామిని మరో బ్రాంచీకి బదలీ చేస్తానని, ఆ బాధ్యత తనదేనని చెప్పాడట. తీవ్ర ఒత్తిడి తేవడంతో ఓ సమయంలో ప్రణయ్ కుటుంబ సభ్యులు అంగీకరించారని అంటున్నారు. సిమ్‌లను మారుతీరావుకు ఇచ్చేశారని చెబుతున్నారు. ఆ తర్వాత, ప్రణయ్, అమృతలు ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకున్నారు. #PranayPerumllaKumar #AmruthaVarshini #maruthirao #ajay #kareem #telangana #nalgonda
Be the first to comment