Skip to playerSkip to main content
  • 8 years ago
Nithin in Kamal Hassan and Vikram Film. Hassan and Vikram produce this movie.

హీరో నితిన్ కు 2018 సంవత్సరం బాగా కలసి వచ్చేలా కనిపిస్తోంది. ఈ హీరో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లని ఒకే చేస్తూ తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు. ఇటీవల కాలంలో నితిన్ మంచి విజయాల్ని అందుకుంటున్నాడు. అతడి మార్కెట్ కూడా పెరుగుతోంది. తాజాగా నితిన్ ని మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్. ఆయన నిర్మాణంలో వస్తున్న ఛల్ మోహన్ రంగ చిత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విదులైన టీజర్, రెండు సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య రౌడీ ఫెలో చిత్రంతో దర్శకుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛల్ మోహన్ రంగ చిత్రానికి ఇతడే దర్శకుడు. ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది.

ఛల్ మోహన్ రంగ చిత్రం తరువాత నితిన్ చేస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. దిల్ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో నితిన్ నటిస్తున్న చిత్రం ఇదే.

నితిన్ కు మరో బంపర్ ఆఫర్ దక్కింది. విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో నటించే అవకాశం కూడా దక్కింది.

టాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న నితిన్ని కమల్ అప్రోచ్ అయ్యారట. ఓ ప్రెంచ్ సినిమా రీమేక్ లో నటించడానికి కమల్ నితిన్ ని అడిగినట్లు తెలుస్తోంది.
Be the first to comment
Add your comment

Recommended