Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంక్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) ప్రకటించిన తాజా జాబితాలో ఆంధ్రప్రదేశ్‌‌కు ఫస్ట్ ర్యాంక్ దక్కింది.గత ఏడాది ప్రకటించిన జాబితాలో తెలంగాణతో కలసి ఏపీ తొలిస్థానంలో ఉండేది. ఈ సారి ఏపీ ఒక్కటే తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణ (2), హర్యానా (3), జార్ఖండ్ (4) స్థానం దక్కించుకున్నాయి
కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. 0.09 శాతం తేడాతో ఈవోడీబీలో తెలంగాణకు తొలి ర్యాంకు దూరమైందన్నారు.

Telangana minister KT Rama Rao on Tuesday congratulated Andhra Pradesh for ease of doing business top rank.
#ktr
#telangana
#easeofdoingbusiness
#ChandrababuNaidu

Category

🗞
News

Recommended