రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

  • 6 years ago
Fuel prices on Monday touched a new high with petrol at Rs 78.27 and diesel at Rs 69.17 in Delhi. Petrol price was today hiked by 15 paisa and diesel by 11 paisa.
#Petrolprice
#Fuelprices

పెట్రోల్ ధరలు ఇప్పట్లో దిగొచ్చేలా కనిపించడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోజురోజుకు పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు.. వరుసగా 15వ రోజు కూడా ఎగబాకాయి. సోమవారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.79.27కి చేరుకుంది. డీజిల్ రూ.69.17కి చేరుకుంది. పెట్రోల్ ధర 15పైసల మేర పెరగ్గా.. డీజిల్ ధర 11పైసల మేర పెరిగింది.
చమురు ధరల పెరుగుదలతో పాటు ఎక్సైజ్, వ్యాట్ ల పేరుతో అధిక పన్నులు వసూలు చేస్తున్నందువల్లే.. ధరల పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజీల్ లను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొంతమంది డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ప్రభుత్వం గనుక పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోని 28శాతం స్లాబు కిందకు తీసుకువస్తే ధరలు చాలామేరకు తగ్గుతాయి. లీటరు పెట్రోల్ ధర రూ.26.9మేర, డీజిల్ ధర రూ.15.4మేర తగ్గుతుంది.
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినంత మాత్రానా పెద్దగా మార్పు ఏమి ఉండదన్నారు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ. అప్పుడు రాష్ట్రాలు తమ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వేరే రూపాల్లో మరిన్ని పన్నులు బాదుతాయన్నారు.

Recommended