దసరా ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

  • 6 years ago
The revised price for the two fuels in the city now stands at Rs 88.08 per liter and Rs 79.24 per litre, respectively, according to Indian Oil Corporation.
#Petrol
#dieselprices
#metrocities
#increase
#lpg
#lpgprice
#lpgcylinder

గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు విజయదశమి పండుగ సందర్భంగా కొద్దిగా తగ్గి ఉపశమనం కలిగించాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.62 గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.75.58గా ఉంది. మెట్రో నగరాలైన ముంబై, చెన్నై, కోల్‌కతా ప్రాంతాల్లో పెట్రోల్‌పై 21పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గించినట్లు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వెల్లడించాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 21పైసలు తగ్గడంతో లీటర్‌ ధర రూ.88.08గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 22పైసలు తగ్గగా, డీజిల్‌పై 12పైసలు తగ్గింది.

Recommended