Skip to playerSkip to main content
  • 8 years ago
Last rites of 21-year-old Vaishnav, son of former Union minister, Bandaru Dattatreya, held at Saidabad crematorium, in Madannapet.

మంగళవారం అర్ధరాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.
బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు సైదాబాద్‌లోని శ్మశాన వాటికలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య... హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
వైష్ణవ్ అంత్యక్రియల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయను పరామర్శించారు. పలువరు నేతలు కన్నీటిపర్యంతమయ్యారు. బండారు దత్తాత్రేయ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంగళవారం రాత్రి సంఘటన జరిగినప్పటి నుంచి తుది అంకం ముగిసే వరకు దత్తాత్రేయతోనే ఉండి వారి కుంటుంబాన్ని ఓదార్చారు.
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్ (21)‌ హఠాన్మరణం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జ నసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు.

Category

🗞
News
Comments

Recommended