Skip to playerSkip to main content
  • 8 years ago
Chiyaan Vikram's daughter Akshita got married to her longtime boyfriend Manu Ranjith, son of CK Ranganathan of the Cavincare group.
తమిళ సూపర్‌స్టార్, చియాన్ విక్రమ్ కూతురు అక్షిత వివాహం సోమవారం ఉదయం చెన్నైలో పెద్దల సమక్షంలో జరిగింది. కెవిన్‌కేర్ గ్రూప్ అధినేత సీకే రంగనాథన్ కుమారుడు రంజిత్‌తో అక్షిత వివాహం జరిగింది. విక్రమ్ అల్లుడు మను రంజిత్ డీఎంకే అధినేత ఎంకే కరుణానిధికి ముని మనువడు కావడం విశేషం. వీరి వివాహం కరుణానిధి నివాసంలో నిరాడంబరంగా జరగడం గమనార్హం.
గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్న అక్షిత, రంజిత్ .. డీఎంకే అధినేత కరుణానిధి ఎదుట ఒక్కటయ్యారు. చెన్నైలోని గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఈ వేడుక జరిగింది. కరుణానిధి ఎదుట అక్షిత మెడలో రంజిత్ మూడు ముడులు వేశాడు. ఈ వివాహం నేపథ్యంలో తమిళ సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఇరు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తల ప్రకారం.. అక్షిత, రంజిత్ వివాహ రిసెప్షన్ మంగళవారం చెన్నైలోని మేయర్ రామనాథన్ హాల్‌లో జరుగనున్నది. ఈ విందుకు దక్షిణాది సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
Be the first to comment
Add your comment

Recommended