పవన్ కళ్యాణ్ కూడా కోర్టుకు వెళ్లొచ్చు కదా : శ్రీరెడ్డి కౌంటర్

  • 6 years ago
Pk ji,why r u doing protest for andra??go to police station or court for special status(joke)..we are also same,u dn hv min respect who r fighting for telugu girl's respect,n independence nd against casting couch..u dn need to open ur mouth forcibly,we can understand ..girls never ever ask pks support..shame on movie industry.

టాలీవుడ్‌లోని కాస్టింక్ కౌచ్ పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని సినీ నటి శ్రీరెడ్డి ఇటీవల డిమాండ్ చేశారు. శనివారం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ పవన్ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరెడ్డి ఇష్యూపై కూడా స్పందించారు.
పరిశ్రమలో వేధింపులు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని, టీవీ ఛానల్స్ ముందుకు వెళ్లడం సరికాదన్నారు. దీనిపై శ్రీరెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలు తనకు అసంతృప్తిని కలిగించాయన్నారు. పవన్ స్టేట్‌మెంట్ తనకేమీ ఆనందాన్ని కలిగించలేదని, అయితే ఇట్స్ ఒకే అన్నారు.
ఇతర మహిళల రక్షణపై మాట్లాడటం, తనను తక్కువ చేయడం అర్థం కాలేదన్నారు. అయినా ఫరవాలేదన్నారు. తానేమీ ఈర్షగా లేనన్నారు. ప్రజల దృష్టి తనపై పడాలని కోరుకోవడం లేదని, ఇతరుల మాదిరిగా తనకేమీ పాపులారిటీ అవసరం లేదన్నారు. అంతకుముందు మరో ట్వీట్‌లో కల్యాణ్ మహిళల సమస్యలపై పవన్ మాట్లాడటం తనకు సంతోషాన్ని కలిగించిందని,ఆయన వంటి వాళ్లు స్పందిస్తే అసాంఘిక కార్యకలాపాలపై త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదన్నారు. తనను పోలీస్ స్టేషన్‌కు వెళ్లమన్న పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ గారు.. ఏపీకి హోదా కోసం మీరు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, హోదా కోసం కోర్టుకు లేదా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్నారు. మీరేం చేస్తున్నారో మేం అదే చేస్తున్నామన్నారు.

Recommended