Skip to playerSkip to main content
  • 8 years ago
Naga chaitanya announces his next movie with Samantha. Samantha super excited about this.
సమంత నాగ చైతన్య వెండి తెరపై మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా సక్సెస్ ఫుల్ జంట. సినిమాల్లో విజయవంతంగా తమ జర్నీ ప్రారంభించిన నాగ చైతన్య, సమంత.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమని గెలిపించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సమంత తెలుగులో రంగస్థలం, తమిళంలో అభిమన్యుడు వంటి చిత్రాలలో నటిస్తోంది. నాగ చైతన్య సవ్యసాచి చిత్రంతో బిజీగా ఉన్నాడు. చై సామ్ కాంబినేషన్లో వివాహం తరువాత తొలి చిత్రం రాబోతోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. రియల్ లైఫ్ కపుల్ కలసి నటించబోతుండడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది.

చైతు, సమంత ఏం మాయ చేశావే చిత్రం తరువాత మరో రెండు చిత్రాల్లో నటించారు. ఆటో నగర్ సూర్య చిత్రంలో జంటగా మెరిశారు. చై సామ్ మరో మారు నటించిన మనం చిత్రం క్లాసికల్ హిట్ గా నిలిచినది.

కలసి నటిస్తున్న సమయంలోనే చై సామ్ మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న చై సామ్ నిజ జీవితంలో కపుల్స్ గా మారారు.

ఇటీవల చైతు సమంత కలసి మరో చిత్రంలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. సమంత, చైతు కలసి నటించడానికి రంగం సిద్ధం అయింది.

తన భార్యతో కలసి నటించబోతున్న విషయాన్ని నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. నిన్ను కోరి చిత్రంతో విజయం సాధించిన దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని చైతు తెలిపాడు. తన భార్య సమంతతో కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానని.. ఒకవేళ ఆమె అవకాశం ఇస్తే అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
Be the first to comment
Add your comment

Recommended