Skip to playerSkip to main content
  • 8 years ago
Vishal to remake NTR movie. Huge craze for Temper in Kollywood

జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ లోని అద్భుత నటుడికి ఈ చిత్రం కూడా ఓ నిదర్శనం. బ్యాడ్ కాప్ గా ఎన్టీఆర్ ఈ చిత్రంలో చెలరేగి పోయి నటించాడు.
ఎన్టీఆర్ వైవిధ్యమైన నటన, డాన్సులు పూరి జగన్నాథ్ దర్శకత్వం ఇలా అన్ని అంశాలు ఈ చిత్ర ఘన విజయానికి దోహదం చేశాయి. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో అంతకు ముందు ఆంధ్రావాలా చిత్రం వచ్చింది. ఆ ఆచిత్రం నిరాశ పరిచింది. కానీ టెంపర్ చిత్రం తో మాత్రం రెండవసారి గట్టిగా కొట్టారు. ఎన్టీఆర్ ని పోలీస్ గెటప్ లో పూరి జగన్నాథ్ తన స్టైల్ లో చూపించారు.
ఈ మధ్య వచ్చిన పోలీస్ కథలో టెంపర్ చిత్ర కథ చాల వైవిధ్యమైనది. ఈ చిత్రంపై పక్క సినీ ఇండస్ట్రీల హీరోలు కన్నేశారు. బాలీవుడ్ లో టెంపర్ చిత్రం రీమేక్ అవుతోంది. రణవీర్ సింగ్ ఈ చిత్రం లో నటించబోతున్నాడు. కేవలం బాలీవుడ్ లోనే కాదు.. తమిళ నాట కూడా టెంపర్ రీమేక్ హక్కులకు మంచి క్రేజ్ ఉంది.
మన పందెం కోడె ఏ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట
హీరో విశాల్ కూడా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వచించె అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాశి ఖన్నాహీరోయిన్ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది.
టెంపర్ చిత్రం ఎన్టీఆర్ వన్ మాన్ షో గా సాగుతుంది. అసామాన్యమైన ఎనర్జీ తో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ఎన్టీఆర్ స్టామినాకి సరితూగేలా టెంపర్ చిత్రంలో నటించాలంటే మిగిలిన హీరోలకు సవాలే.
Be the first to comment
Add your comment

Recommended